కోనసీమ: ఆలమూరు మండలం మడికి గ్రామ కూరగాయల మార్కెట్ సమీపంలో ఆదివారం సాయంత్రం పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 11 మందిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 14, 500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఆలమూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ సి.హెచ్. విద్యాసాగర్ తెలిపారు.