ఎన్నో సూపర్‌డూపర్ హిట్లు కొట్టి, నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరావు నటవారసత్వాన్ని అత్యంత విజయవంతంగా నిలబట్టిన ఘనత యువసమ్రాట్ నాగార్జునకి ముమ్మాటికి దక్కుతుంది. కెరీర్ బిగినింగ్‌లో కొన్ని వైఫల్యాలను చవిచూసినా సరే. నిలకడగా కెరీర్‌ని విజయపథంలోకి నడిపించుకున్ని పత్యేకతకి నాగార్జున ఎప్పటికీ చెరగని సంతకం. మణిరత్నం అంటే ఏంటో కూడా తెలుగు చిత్రపరిశ్రమకి పూర్తిగా తెలియని రోజుల్లోనే, ఏటికి ఎదురీదినట్టుగా గీతాంజలి సినిమాకి సైన్ చేసి సరికొత్త చరిత్రకి నాగార్జున శ్రీకారం చుట్టారు. తర్వాత వచ్చిన శివ కూడా చాలా విచిత్రమైన ప్రయోగం. రామ్ గోపాల్ వర్మ ఇప్పుడంటే ఆబాలగోపాలానికి తెలిసిన దర్శకుడిగా కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్న శివ సినిమా టైంకి ఆయనొక మరీపూర్తిగా కొత్తవాడు. ఎందరో వర్మ దర్శకుడంటే పెదవివిరిచారు. నాగార్జున అయితే గట్టి ప్రతిఘటననే ఎదుర్కొన్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కానీ తనదైన పట్టుదలతో వర్శని దర్శకుడిగా సమర్ధించారు. శివ నాగార్జున కెరీర్లోనే కాదు, తెలుగు సినిమా చరిత్రకే ఓ పెద్దమలును. ఎవ్వరూ ఊహించని మేలుకొలుపు. అలా నాగార్జునకి కొత్తరక్తంతో సినిమాలు చేయడం ఆసినిమాలతో వినూత్నమైన వైవిధ్యాన్ని ప్రవేశపెట్టడం వెన్నతో పెట్టిన విద్యలా మారిపోయింది.
ఇంక సరే అన్నమయ్య మరో సంచలన చరిత్ర. షిరిడీ సాయిబాబా, రామదాసు చిత్రాల గురించి ఏం చెప్పాలి? అన్నమయ్య పాత్రకి నాగార్జున ఏం పనికొస్తాడన్నారు. సరేసరిపోడు అని ఓమని రొదపెట్టారు. అందరి అనుమానాలను పటాపంచలు చేసి, అన్నమయ్యంటే నాగార్జున, నాగార్జున అనే రికార్డు క్రియేట్ చేశారు నాగార్జున. భక్తిరసపాత్రలకి, చిత్రాలకి పేరుమోసిన నటసమ్రాట్ అక్కినేని నిజమైన వారసుడు అనిపించుకోవడంలో నాగార్జున గొప్పతనాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు.
మాస్ హిట్స్, క్లాస్ హిట్స్, డివోషనల్ హిట్స్….ఒకటి కాదు రెండు కాదు కెరీర్ మొత్తం సంచలనాల మయం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాగార్జున వందో చిత్రమనే మైలురాయిని చేరుకున్నారు. ఇప్పుడా చిత్రనిర్మాణ సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నాగార్జున ప్రపంచవ్యాప్త అభిమానులు కూడా దీన్నో పండగలా భావిస్తున్నారు. నూరవ చిత్రానికి కూడా నాగార్జున తన ప్రయోగాత్మక పంథాని విడనాడలేదు. నితం ఒరు వానమ్ చిత్రానికి దర్శకత్వం వహించిన రా కార్తీక్ దర్శకత్వంలో నాగార్జున నూరవ చిత్రం రూపొందడానికి సర్వసన్నాహాలు పూర్తయ్యాయి, త్వరలోనే ఇది సెట్స్ కి వెళ్ళడానికి సిద్ధమైంది. ఈ చిత్రానికి కింగ్ హండ్రెడ్ నాటౌట్ అనే టైటిల్ ఖరారైనట్టుగా ప్రచారంలో ఉన్నా కూడా, నిర్మాతలు దీనిని ఖరారు చేయలేదింకా. కానీ కథమాత్రం మాఫియా నేపథ్యంలో జరుగుతుందని తెలుస్తొంది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం వాడివేడిగా జరుగుతున్న చర్చ ఏమిటంటే ఈ ట్రెండ్‌లో నాగార్జున మాఫీయా చిత్రంలో చేసి, ఒప్పించగలడా అనే ఓ విశ్లేషణ చాలా జోరుగా సాగుతోంది. ఇదే నాగార్జున కెరీర్లో విచిత్రం. ఎందరు ఎన్ని విశ్లేషణలు చేసినా కూడా, వాటిని అధిగమించి, అంతిమ విజయం సాధించడంలో నాగార్జున ఎప్పుడూ విజయార్జునుడే.
కెరీర్ మొదట్లో వరస ఫ్లాపులు వస్తున్నప్పుడు తమిళ దర్శకుడు మణిరత్నంని తెరమీదకి తెచ్చి, వైఫల్యాలని పవర్ బ్రేక్ కొట్టారు నాగార్జున .ఈ మధ్య రోజుల్లో నాగార్జునకి చెప్పుకొదగ్గ హిట్ పడలేదు. సో ఇప్పుడు మళ్ళీ తమిళ్ దర్శకుడే తెరమీదకి వచ్చారు. నాగార్జున తెచ్చారు.
సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవడం ఖాయం అన్నది పలువురు అంటున్న మాట.
నాగార్జునగారూ……విష్ యు బెస్టాఫ్ లక్.