HYD: ఉప్పల్ పరిధిలోని గణేష్ నగర్ కాలనీ వాసులు ఓ ఆన్లైన్ యాప్ ద్వారా కూరగాయలు కొనుగోలు చేశారు. వాటిని కట్ చేసి చూడగా అన్ని పుచ్చులు, కొన్ని ఖరాబై ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సదరు మేనేజ్మెంట్ బృందానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. ప్రస్తుతం జనాలు ఆన్లైన్ ద్వారానే ఎక్కువగా కొనుగోళ్లు జరుపుతున్నారని, ఈ-కార్ట్ సర్వీసులపై తనిఖీలు చేయాలని కోరుతున్నారు.