సత్యసాయి: బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నేడు హిందూపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంలో, ఆదివారం సాయంత్రం హిందూపురంలో జరిగే సన్మాన కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొంటారని తెలిపారు.