NTR: ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా చెన్నై సెంట్రల్(MAS), భగత్-కి-కోటి(BGKT) మధ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 5 నుంచి MAS- BGKT(నెం. 20625), ఈ నెల 7 నుంచి BGKT-MAS(నం. 20626) మధ్య ఈ ట్రైన్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు APలో కొండపల్లి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఆగుతుందన్నారు.