NZB: రైల్వేస్టేషన్లో బాంబ్ పెట్టినట్లు ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేశాడు. శుక్రవారం ఓ వ్యక్తి డయల్ 100కి ఫోన్ చేసి రైల్వే స్టేషన్లో బాంబ్ పెట్టినట్లు బెదిరించాడు. దీంతో పోలీసులు స్టేషన్ మొత్తం గాలించారు. అనంతరం విచారణ చేపట్టగా హైదరాబాద్లోని కీసరకు చెందిన ఓ వ్యక్తి ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించారు. అతడిపై శనివారం కేసు నమోదు చేశారు.