అన్నమయ్య: క్రిస్టియన్ల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష పేర్కొన్నారు. సోమవారం గ్లోరీ ఫాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు బోనాసి జాన్ బాబు ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. క్రిస్టియన్లకు కూటమి ప్రభుత్వం గౌరవ వేతనాలు విడుదల చేయడం జరిగిందన్నారు.