W.G: పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తయ్యేలా పనులు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామని అన్నారు. ఈ ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా వైసీపీ నేతలకు తెలియదని మంత్రి నిమ్మల విమర్శించారు. జగన్ ఇరిగేషన్ శాఖలో రూ.18 వేల కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టారని పేర్కొన్నారు.