W.G: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారుల నుండి స్వీకరించిన అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత శాఖల అధికారులును ఆదేశించారు. సోమవారం భీమవరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ 237 అర్జీలను స్వీకరించారు.అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలన్నారు.