సత్యసాయి: డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని చరిత్రలో నిలిచిపోతారని మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు అన్నారు. సోమవారం మడకశిరలో డీఎస్సీ అభ్యర్థులతో కలిసి సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదన్నారు.