PPM: కురుపాం మండల కేంద్రంలో ఉన్న సంత కోనేరు చెరువులో డ్రైన్ వాటర్ చేరి నీరు కలుషితమై చేపలు చనిపోయాయి. దీనిపై స్పందించిన మత్స్యశాఖ, పంచాయతీ అధికారులు తక్షణమే చెరువులోకి మురుగు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ కార్యదర్శి వెంకట్ నాయుడు తెలిపారు. అలాగే ఘటన స్థలాన్ని పంచాయితీ అధికారులు ఉపసర్పంచ్ ఆదిల్ పరిశీలించారు.