PPM: కురుపాం మండలం నీలకంఠాపురం పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా పాలకొండ డీఎస్పీ రాంబాబు సోమవారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ని సందర్శించి CD ఫైల్స్, రికార్డ్స్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి గ్రీవెన్స్ తెలుసుకున్నారు. ఎల్విన్ పేట సీఐ. హరి, ఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.