E.G: విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా జేసీ ఎస్.చిన్న రాముడు అన్నారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద విభిన్న ప్రతిభావంతురాలు మల్లిం వెంకటేశ్వరికి వీల్ కుర్చీ పంపిణీ చేశారు. విభిన్న ప్రతిభావంతుల స్వతంత్రతను, జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ఉపకరణాలు దోహదపడతాయన్నారు.