BDK: అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మందలపల్లిలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నూతన మల్టీ కార్ గ్యారేజ్ వర్క్ షాప్‌ని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం ప్రారంభించారు. అనంతరం మెకానిక్ రాజుకు శుభాకాంక్షలు తెలిపారు. రాజు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపి సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.