BDK: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ల పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు విడుదల చేయాలని కోరుతూ.. CITU ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కలెక్టర్ స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.