GNTR: ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ప్రతి మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పెమ్మసాని తెలిపారు. సీఎం చంద్రబాబు చేపట్టిన డ్వాక్రా కార్యక్రమం మహిళల ఆర్థిక సాక్షరతకు మద్దతుగా నిలుస్తుందన్నారు.