MBNR: అకాల వర్షాల కారణంగా తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడవద్దని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. అడ్డాకులలోని వరిధాన్యం కొనుగోలుకేంద్రాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా నిన్నకురిసిన వర్షానికి కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు.