NRML: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారికి కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కలెక్టర్కు స్వాగతం పలికారు. అనంతరం పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ భక్తుల సౌకర్యాల కోసం మెరుగైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.