CTR: రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలో రొంపిచర్ల మండలానికి చెందిన విద్యార్థి విక్రాంత్ రెడ్డి మొదటి స్థానం దక్కించుకున్నాడు. రొంపిచర్ల మండల ఏపీ మోడల్ స్కూల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థి విక్రాంత్ రెడ్డి సోమవారం వెస్ట్ గోదావరిలో జరిగిన దివ్యాంగుల రన్నింగ్ రేస్ పోటీల్లో పాల్గొన్నారు. దీంతో రాష్ట్ర స్థాయిలో విన్నర్ నిలిచారు.