సత్యసాయి: సోమందేపల్లికి చెందిన ఐటీడీపీ కార్యకర్త మద్దిలేటికి మంత్రి సవిత తన సొంత నిధులతో బొలెరో వాహనాన్ని అందజేశారు. దుకాణం పెట్టుకుని జీవనోపాధిస్తుండగా వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు దుకాణాన్ని తొలగించి కార్యకర్తకు ఉపాధి లేకుండా చేశారని మంత్రి తెలిపారు. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు మద్దిలేటికి వాహనాన్ని అందజేసి ఉపాధి చూపినట్లు వివరించారు.