SKLM: ఆమదాలవలస MRO కార్యాలయం వద్ద ఆమదాలవలస పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన ధర్నా జరిగింది. 12వ పీఆర్సీ కమీషన్ నియమించి వెంటనే 30శాతం మద్యంతర భృతి చెల్లించాలని, ఓపీఎస్ అమలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరువు భత్యం (డీఆర్) బకాయిలు, 11వ పీఆర్సీ యొక్క 21నెలలు బకాయిలు చెల్లించాలని కోరుతూ.. ఎమ్మార్వోకు వినతి పత్రం అందించారు.