NTR: నందిగామ మండలం కొత్త కంచల గ్రామంలో సోమవారం శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయ ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలలో పాల్గొని వినాయకున్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.