కృష్ణా: కంకిపాడులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కూటమి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రారంభించారు. ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో దోహద పడతాయని ఆయన తెలిపారు. ఈ మేరకు జనసేన పార్టీ నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు గ్రామ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సుంకర శివ, తదితరులు పాల్గొన్నారు.