AP: లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి సిట్‌కు సమాచారం ఇచ్చాడు. రేపు మ.12 గంటలకల్లా సిట్ ఆఫీస్‌కు వస్తానని తెలిపాడు. అధికారులకు తన తండ్రి సమాచారం ఇచ్చాడని, ముందస్తు బెయిల్ విచారణకు సమయం పట్టేలా ఉందని పేర్కొన్నాడు. అందుకే రేపు సిట్ విచారణకు వస్తానని వెల్లడించాడు. ఇప్పటికే మద్యం కేసులో రాజ్ కసిరెడ్డికి నాలుగు సార్లు అధికారులు నోటీసులు ఇచ్చారు.