SRPT: సూర్యాపేట మండలం టేకుమట్ల సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాత్రి టేకుమట్ల వద్ద తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఒక కంటైనర్లో అక్రమంగా జనగామ జిల్లా నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 18 ఎద్దులు, 9 దున్నపోతులను పట్టుకున్నట్లు సీఐ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.