GNTR: మున్సిపల్ కార్యాలయంలో సోమవారం శంకర్ విలాస్ వంతెన విస్తరణలో భాగంగా భూములు ఇచ్చిన షాపు యజమానులకు రూ. 70 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. అభివృద్ధికి అడ్డుగా ఉన్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్ళ మాధవి, బూర్ల రామాంజనేయులు ఉన్నారు.