అనంతపురం: పెద్దవడుగూరు మండలంలో గాలివానకు అప్పేచెర్లలో విరుపాక్షిరెడ్డి అనే రైతు తనపొలంలో 4 ఎకరాల పొలంలో బొప్పాయి సాగుచేశారు. ఆదివారం ఈదురగాలుల వర్షానికి బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. దాదాపు నాలుగు లక్షల నష్టం వాటిల్లింది, మండల రెవెన్యూ అధికారులు పొలాన్ని సందర్శించి తగిన పరిహారం అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక పంపవలసిందిగా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.