అనంతపురం: గత పది రోజులుగా యాడికిలోని కొన్ని కాలనీలలో నీటి సరఫరా జరగడంలేదని స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. వెంటనే తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి యాడికిలో నీటి సమస్యను పరిష్కరించాలని డీఈ రాంగోపాల్ రెడ్డిని ఆదేశించారు. సోమవారం ఉదయం 5 గంటల నుంచి డీఈ, రాంగోపాల్ కాంట్రాక్టర్ హరినాథ్ రెడ్డి రుద్రమ నాయుడు కాలనీలలో తిరిగి నీటిని విడుదల చేయించారు.