NZB: గిరిరాజ్ గవర్నమెంట్ ( G.G )కాలేజీలో ఏర్పాటు చేసిన రైతు మహోత్సవం కార్యక్రమం ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదివారం సాయంత్రం పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 23 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.