ATP: గుంతకల్లులో ఆదివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసింది. ఇందులో భాగంగా 30 వార్డులోని పీఎన్టీ కాలనీలో వేప చెట్టు విరిగి విద్యుత్ తీగల మీద పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆ సమయంలో బయట ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ తీగలకు మరమ్మతు పనులు చేపట్టారు.