ELR: పోలవరం ప్రాజెక్ట్‌లో కాంక్రీట్, బట్రెస్ డ్యాం పనులను పరిశీలించేందుకు కేంద్ర జలసంఘంలోని ముగ్గురు శాస్త్రవేత్తలు రేపు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రానికి రాజమండ్రి చేరుకుని, మంగళవారం పోలవరం వస్తారన్నారు. ఇద్దరు డయాఫ్రం వాల్ నిర్మాణంలో వినియోగిస్తున్న కాంక్రీట్ పరీక్షలు చేయనుండగా.. మరొకరు బట్రెస్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలిస్తారు.