ATP: జిల్లాలో ఆదివారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. తాజాగా అధికారులు వర్షపాతం వివరాలను వెల్లడించారు. గుంతకల్లు మండలంలో అత్యధికంగా 58.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. చెన్నేకొత్తపల్లిలో 34.0మి.మీ, హిందూపురంలో 25.5 మి.మీ, గుత్తిలో 13.5 మి.మీ మేర వర్షం కురిసిందని చెప్పారు. పలు మండలాల్లో మోస్తరు వర్షం పడిందని తెలిపారు.