BPT: రైతులు పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతూ.. పర్చూరు వైసీపీ ఇన్ ఛార్జ్ గాదే మధుసూదన్ రెడ్డి ఈ రోజు ఇంకొల్లు స్థూపం సెంటర్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని గాదే కోరారు.