AP: విశాఖ శారద పీఠానికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. తిరుమలలోని విశాఖ శారదాపీఠం భవనాన్ని అప్పగించాలని ఆదేశించింది. గోగర్భం డ్యామ్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం జరిగినట్లు టీటీడీ గుర్తించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు న్యాయస్థానం తేల్చింది. దీంతో 15 రోజుల్లోగా మఠం ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ నోటీసుల్లో పేర్కొంది.