కడప: రాష్ట్ర ప్రభుత్వం ఆదరణ పథకం కింద పనిముట్లను అందిస్తునట్లు ఎంపీడీవో ముకుంద రెడ్డి తెలిపారు. నేడు మధ్యాహ్నం 3 గంటలకు MPDO కార్యాలయం నందు సమావేశం నిర్వహించబడుతుందన్నారు. నాయి బ్రాహ్మణ, హెయిర్ డ్రెస్సింగ్, కార్పెంటర్, చేపలు పట్టు వారు, వడ్రంగి, రాతిచెక్కడం వంటి సాంప్రదాయ వృత్తులలో నిమగ్నమైన వ్యక్తులకు పనిముట్లను అందించడం జరుగుతుందని ఎంపీడీఓ అన్నారు.