KRNL: భూ సమస్యలతో టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణం 4 నెలలుగా ఆలస్యం అయిందని మంత్రి టీజీ భరత్ అన్నారు. 6 నెలల్లో టమాటా ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రూ.11 కోట్లతో ఈ యూనిట్ నిర్మిస్తామన్నారు. ఇక్కడ రోజుకు 15 టన్నుల టమాటాలు ప్రాసెసింగ్ అవుతాయన్నారు. అంతేకాకుండా టమాటాతో పాటు ఇతర పండ్ల ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసుకోవచ్చన్నారు.