CTR: APSSDC ఆధ్వర్యంలో చిత్తూరులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి జి. పద్మజ తెలిపారు. 3 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారన్నారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా ప్రకటించారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.