TG: ఉపాధి పేరుతో మయన్మార్ తీసుకువెళ్లి కొందరిని సైబర్ నేరాలు చేయిస్తున్నారు. అలా మోసపోయిన 24 మంది బాధితులను మయన్మార్ నుంచి HYDకి తీసుకువచ్చారు. అందులో 15 మంది ఏజెంట్లు, దళారులు ఉన్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. మరోవైపు హైదరాబాద్లో ఉంటూ సైబర్ నేరాలకు పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు నిందితులు విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.