AP: రాష్ట్రంలో కూటమి, దేశంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిందంటే.. పవన్ కళ్యాణే కారణమని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. అలాంటి పవన్ కళ్యాణ్‌ను కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని జగన్ అవమానించారని మండిపడ్డారు. అసలు జగన్ పులివెందులకు ఎక్కువ.. కడపకు తక్కువ అని ఎద్దేవా చేశారు. పవన్ ఒక తుపాను అని మోదీయే అన్నారని గుర్తు చేశారు.