TG: వికారాబాద్‌లోని పరిగి దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. బస్సును పక్కన ఆపే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉండగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిగి నుంచి షాద్‌నగర్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.