E.G: ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మార్చి నెలలో “ఒకసారి వాడిన ప్లాస్టిక్‌ను నివారించండి..పునర్వినియోగాన్ని ప్రోత్సహించండి ” అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నట్టు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. నగరపాలక సంస్థ అధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో శానిటేషన్, ప్లాస్టిక్ అరికట్టడంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.