ELR: నిడమర్రు మండలం అడవికొలను గ్రామంలోని రామాలయం వీధిలో మురుగు నీరు సమస్యపై అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. ఎంపీడీవో వీధిలో పర్యటించి స్థానిక నాయకులు, ప్రజలతో చర్చించి రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. రెండు నెలల పోరాటానికి ప్రతిఫలం దక్కిందని కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.