కర్నూలు: పత్తికొండ నియోజకవర్గలోని బి. ఆగ్రహారంలో వాటర్ ట్యాంక్, సీసీ రోడ్లను ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు శుక్రవారం ప్రారంభించారు. ఇందులో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు పాల్గొన్నారు. గ్రామ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ. 57.22 లక్షల నిధులతో వాటర్ ట్యాంక్‌ను నిర్మించామన్నారు.