సత్యసాయి: కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను భీమవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఇటీవల శ్రీనివాస వర్మ ప్రయాణిస్తున్న కారును ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస వర్మ తల, కాలుకు గాయాలైన విషయం తెలిసిందే.