కర్నూలు: నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయి డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రజా చైతన్య యాత్ర కర్నూలులో కొనసాగింది. రోజా ప్రాంతంలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని ప్రజలు వాపోతున్నారన్నారు.