ADB: నేరడిగొండ మండల కేంద్రంలో హోలీ సంబరాలను శుక్రవారం ఉదయం నుంచి ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంబరాల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే నివాసానికి చేరుకొని ఆయనకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సామరస్య పూర్వకంగా ఘనంగా నిర్వహించుకోవాలని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.