SKLM: స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్రకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ పూజారి బాలాజీ ప్రసాద్ తెలిపారు. ఆమదాలవలస పట్టణంలో పర్యావరణ పరిరక్షణ కోసం శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, పాలిథిన్ కవర్లు పూర్తిగా నిషేధించాలని వ్యాపారులకు సూచించారు. 120 మైక్రాన్లలోపు ఉన్న కవర్లను వినియోగించరాదని ప్రజలకు తెలిపారు.