మద్దిలపాలెం శివాలయం వీధిలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ శుక్రవారం రోడ్డు పనులు ప్రారంభించారు. మద్దిలపాలెం శివాలయం నుంచి ఫిష్ మార్కెట్ వరకు సిమెంట్ రోడ్డు వేస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి మెరుగైన రోడ్లు వేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.