PPM: సీతానగరం మండలం లచయ్యపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ బీమలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠా వేడుకలు శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు హాజరై బీమలింగేశ్వర స్వామిని దర్శించుకుని అనంతరం ప్రత్యేక పూజలు చేశారు.