TG: చట్టసభల్లో సభకు నాయకుడు సీఎం అని.. సభకు అధిపతి స్పీకర్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. స్పీకర్‌ను ఉద్దేశించి సభ తమ ఒక్కరిది కాదని అనడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకత్వం జగదీశ్‌రెడ్డి చేసింది తప్పు అని చెప్పట్లేదని విమర్శించారు. సభకు కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉంటాయని తెలిపారు.